Harsha Kumar : చంద్రబాబు అరెస్ట్ ను జగన్ వాడుకుంటున్నారు : హర్షకుమార్

పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడి మళ్ళీ నోరు విప్పలేదు..? అంటే బీజేపీ నోరు నొక్కిందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి కూడా మళ్ళీ నోరు విప్పలేదన్నారు.

Harsha Kumar : చంద్రబాబు అరెస్ట్ ను జగన్ వాడుకుంటున్నారు : హర్షకుమార్

Former MP Harsha Kumar

Updated On : September 28, 2023 / 1:52 PM IST

Harsha Kumar – Jagan : చంద్రబాబు అరెస్ట్ ను సీఎం జగన్ వాడుకుంటున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ నైతిక విలువల్ని పాటించాలని పేర్కొన్నారు. ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్న పార్టీలన్నీ చంద్రబాబుకు బాణాలులేస్తున్నాయని తెలిపారు. మెడికల్ కాలేజ్ లో సగం సీట్లు జగన్ అమ్ముకుంటున్నారు అన్నది మరుగున పడుతుందన్నారు.

ఈ మేరకు గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడి మళ్ళీ నోరు విప్పలేదు..? అంటే బీజేపీ నోరు నొక్కిందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి కూడా మళ్ళీ నోరు విప్పలేదన్నారు.

BRS party: ప్రధాని మోదీపై బీఆర్‌ఎస్ సరికొత్త అస్త్రం.. బీజేపీని కార్నర్ చేసేందుకు గులాబీ పార్టీ రెడీ!

కేసీఆర్, బీజేపీ కలిసి పోయారు కాబట్టి బీజేపీ చెప్పినట్లు కేటీఆర్ చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమాలు చెయ్యొద్దు అనడానికి కేటీఆర్ ఎవరు అని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాంగ్రెస్ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలిస్తుందన్నారు.