ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆగస్ట్27, గురువారం కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
https://10tv.in/kerala-sabarimala-temple-to-tap-on-massive-gold-reserve-tdb-to-approach-rbi-for-gold-loans/
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా సంస్థ తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. మత్స్య కార, బిసి, గిరిజన, ఎస్ సి కాలనీల్లో ఆ సంస్థ ఆలయాలు నిర్మిస్తుంది. అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణాన్నిపూర్తి చేయడానికి రూ.5 లక్షలు, కొత్తగా నిర్మించే ఆలయానికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేయడానికి కమిటీ తీర్మానించింది.