Ap Rains
బంగాళాఖాతంలో తీవ్ర అలప్పీడనం కొనసాగతోంది. నేడు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇది దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజులు ప్రభావం చూపనుంది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడవచ్చని అన్నారు. వచ్చే వారం అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో డిసెంబరు 20 వరకు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతలబేంటి? శిక్షణ తరగతులకు విపక్ష ఎమ్మెల్యేలు వస్తారా?