Heavy Rain In Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ రోడ్లలో బైక్‌లకు నో ఎంట్రీ

మాండౌస్ తుపాను కారణంగా శుక్రవారం నుండి తిరుమలలో వర్షం కురిసింది. వర్షం కారణంగా శనివారం శ్రీవారి మెట్లు మార్గం గుండా వరదనీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

tirumala tirupati

Heavy Rain In Tirumala: మాండౌస్ తుపాను తీరం దాటింది. తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి నగరాన్ని వర్షం ముంచెత్తింది. నగరంలోని రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో తిరుపతిలోని మాల్వాడి గుండంలో వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది.

Mandous Cyclone: తీరందాటిన మాండౌస్ తుపాన్‌.. రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

తిరుపతి కొండపై భారీవర్షం కారణంగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వర్షపు నీరు మొత్తం మాల్వాడి గుండం మీదుగా కపిల తీర్థంకు చేరుకుంటోంది. దీంతో భక్తులను కపిలతీర్థం వద్దనున్న పుష్కరిణిలోకి అనుమతించడం లేదు. భారీ వర్షానికి తిరుమలలో వృక్షాలు కూలాయి. భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశారు.

Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండౌస్.. ఏపీలోని ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు..

మాండౌస్ తుపాను కారణంగా శుక్రవారం నుండి తిరుమలలో వర్షం కురిసింది. వర్షం కారణంగా శనివారం శ్రీవారి మెట్లు మార్గం గుండా వరదనీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విపరీతంగా చలిగాలులు వీస్తుండటంతో మెట్లమార్గంలో తిరుమలకొండపైకి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.