Heavy rains
Heavy rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 7వ తేది ఉదయం వాయుగుండగా బలపడనుంది. ఆ తర్వాత అదే దిశలో పనియనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరనుంది. మెల్లగా కదులుతూ ఈనెల 8వ తేది ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుంది. ఈ మేరకు ఐఎండీ వెల్లడించింది.
మొదటగా వాయుగుండం దక్షిణ తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల 6వ తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని వెల్లడించింది.
Super Cyclone Effect AP : ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు.. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రానున్న రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.