Super Cyclone Effect AP : ఏపీకి సూపర్‌ సైక్లోన్‌ ముప్పు.. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం

ఏపీకి సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్‌ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.

Super Cyclone Effect AP : ఏపీకి సూపర్‌ సైక్లోన్‌ ముప్పు.. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం

super cyclone effect

super cyclone effect ap : ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి సూపర్‌ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్‌ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.

ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఏపీ వైపు పయనించనుంది. ఆ తర్వాత తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి

తుపాను ఏర్పడితే సిత్రాంగ్‌గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావం పడనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.