Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది.

Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి

heavy rains in ap

Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు 20వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టు 4గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముందుజాగ్రతగా గోరెగండ, కోడుమూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆలూరు మండలంలో కుండపోతగా వర్షం పడడంతో హత్తిబెలగళ్‌ నుంచి అర్థగేరికి వెళ్లే రహదారి తెగిపోయింది. ఆదోని పట్టణం పరిషమల్లలో వర్షానికి ఇల్లు కూలి ఫారిద్‌ సహీద్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. 10 సెం.మీ. వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని నడిమివంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నడిమివంక పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు 1000 మందిని పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో ఇళ్లలోకి పెద్ద పెద్ద చేపలు కొట్టుకువచ్చాయి. వరద ప్రవాహానికి కారు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. కణేకల్‌ రోడ్డులో భారీ వృక్షం నేల కూలింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.