House Collapsed : బాబోయ్.. కళ్లముందే కూలిన ఇల్లు.. కడప జిల్లాలో వర్ష బీభత్సం..

కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని..

House Collapsed : భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. రైల్వే కోడూరు నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే జిల్లాలోని ఊటుకూరు చెరువుకు మరమ్మతులు చేశారు. ఇప్పుడా చెరువుకు ఏ క్షణాన అయినా గండి పడే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇక, కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని ముందే గమనించిన ఆ ఇంట్లోని వారు బయటికి వచ్చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యాహ్నం ఆ ఇల్లు కాలువలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

BSNL: బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు షాక్..

కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా తిరుచానూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తిరుచానూరులోని వసుంధర నగర్‌లో ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు.

ఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలమైంది. వరద ముంపు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణంగా నవంబర్ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది క్రమంగా బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచలున్నాయంది. ఇది మరింత బలపడి తుపాన్ గా మారే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 30 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

ఒకప్పుడు చినుకు కోసం ఎదురుచూసిన రాయలసీమను ఇప్పుడు వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వానలు కలవరపెడుతున్నాయి. కుండపోత వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు జల సంద్రంగా మారాయి. ఎటుచూసినా నీళ్లే. ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తాజాగా వచ్చిన వెదర్ అలర్ట్ మరింత భయపెడుతోంది. వారం రోజుల క్రితం కురిసిన కుండపోత వానల నుంచి ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. మరో 48గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. వరుణుడి టార్గెట్‌ మళ్లీ రాయలసీమే కావడం అక్కడి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు