Fridge : ఫ్రిజ్‌లో ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి. తడివాతావరణం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ఉల్లిపాయల్ని చల్లని , పొడి వాతావరణంలో, ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి.

Fridge : ఫ్రిజ్‌లో ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

Refrigerator

Fridge : అధునిక సాంకేతికతో జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిల్లో ఫ్రిజ్ కూడా ఒకటి. ఆహారపదార్ధాలు చెడిపోకుండా ఎక్కవ కాలం నిల్వ ఉంచటంలో ఇది ఉపకరిస్తుంది. ఇటీవలి్కాలంలో ఫ్రిజ్ లలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటున్నారు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచే ఆహారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్రిజ్ లలో పెట్టే ఆహారాలు తాజాగా ఉంటాయనుకోవడం పొరపాటేనని చెప్తున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచటం వల్ల అందులో పోషక విలువలు నశిస్తాయని, అంతేకాకుండా శరీరానికి హాని చేస్తాయని సూచిస్తున్నారు.

ఫ్రిడ్జ్ లో కొన్ని రకాల ఆహార పదార్ధాలను పెట్టకపోవటమే మేలన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఉడికించిన కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్ లో పెడితే పెద్దదిగా అయ్యి చీలిక ఏర్పడి గుడ్డు లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. డ్రింక్స్ కొనుగోలు చేసిన వెంటనే త్రాగటం మంచిది. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి త్రాగటం మంచిది కాదు.

గుడ్లు హై ప్రోటీన్స్ కలిగిన ఆహారం అని మనందరికీ తెలుసు. కాకపోతే గుడ్లను ఎక్కువమంది ఫ్రిజ్లో నిల్వ ఉంచి వాడుతుంటారు. అలా చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలు నశిస్తాయి. పాల ఉత్పత్తులను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పాలు వేడిచేసినప్పుడు గడ్డ గడ్డలుగా ఉంటాయి. పాలలో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. రిఫ్రిజిరేటర్‎లో నిల్వ ఉంచినప్పుడు  పాలు ఘనీభవించి జిగటగా మారుతుంది.

మనం సాధారణం గా మనం తినే కూరగాయలు , పండ్లు ఇలా చాలా వాటిని నిల్వ వుంచటానికి ఫ్రిజ్లలో ఉంచుతాం . ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటాము. కానీ అన్ని పదార్దాలనూ ఫ్రిజ్ లో ఉంచవచ్చా అంటే కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ వుంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి. తడివాతావరణం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ఉల్లిపాయల్ని చల్లని , పొడి వాతావరణంలో, ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి. లేదంటే మిగిలిన కూరగాయలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.

అరటిపండ్లని ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచితో పాటు అందులోని పొటాషియం కూడా పోతుంది. బంగాళదుంపలను ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి కానీ దుంపల్లోని పిండిపదార్థం చక్కెరగా మారిపోతుంది. టమాటలను ఫ్రిజ్లో వుంచడంవల్ల రుచిని కోల్పోవడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది.

బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల త్వరగా డ్రై అవుతుంది.బ్రెడ్ ను చల్లటి వాతావరణంలో ఎక్కువ రోజులు నిలువ ఉంచితే వాటిపై బ్యాక్టీరియా ,ఫంగస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది .ఆలివ్ ఆయిల్ ఫ్రిజ్లో పెడితే దాని స్థిరత్వాన్ని కోల్పోతుంది . పైగా హానికారక క్రియులు తయారై అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వేయించిన ఆహారాన్ని నిల్వ చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వాటిలో పోషకాలు తగ్గిపోతాయి.