Site icon 10TV Telugu

దంచికొడుతున్న వర్షం.. ఈ నెల 14 వరకు ఈ ప్రాంతాల్లో ఇంతే..

Rain

Rain

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్, నాగోల్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలుచోట్ల వర్షం పడుతోంది.

ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం ఎల్లో అలర్ట్ జారీచేసింది. 13, 14వ తేదీల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

Also Read: వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనలు సులభతరం చేయనున్న ప్రభుత్వం

ఆ తేదీలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఈ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి.

Exit mobile version