Telugu States : వానలే..వానలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు, జాగ్రత్త

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని...వాతారణశాఖ తెలిపింది.

Heavy Rains : వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని .. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దీంతో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.

Read More : Chintamaneni : చింతమనేని ఎక్కడ ? చెప్పాలంటూ ఫ్యామిలీ ఆందోళన

బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చంది. అటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Read More : Platelets : ప్లేట్ లెట్స్ ఏస్ధాయికి చేరితే ప్రమాదం… ఎప్పుడు ఎక్కించాలంటే?..

ఇక రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని..  విశాఖ వాతారణశాఖ తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్  కోస్తా-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా .. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..  స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం .. సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించింది.

Read More : Trivikram Srinivas : ప్రతి నెల ఐదువేలు అద్దె కడుతున్న “త్రివిక్రమ్”.. ఎందుకో తెలుసా?

అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడనున్నాయి. సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ, మంగళవారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

గత 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మ లక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8 సెంటీమీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది.

Read More :TTD : సంప్రదాయ భోజనంపై వైవీ అయిష్టత, టీటీడీ పాలకమండలి నిర్ణయం కాదు

ట్రెండింగ్ వార్తలు