Chittoor Rangampeta : రంగంపేట జల్లికట్టు తీరు తెలుసా.. పలకలు చేజిక్కించుకున్న వాడే మొనగాడు

కోడెద్దులకు యువకులు ఎదురెళ్లి వాటిని పట్టుకుని లొంగ తీసుకుంటారు. ఆ పలకలు చేజిక్కించుకున్న వారే ఇక్కడ మొనగాడు.

Rangampeta Jallikattu : చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టుకు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా.. పోటీల నిర్వహణలో తగ్గేదేలే అంటున్నారు యువకులు. భారీగా తరలివచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రంగంపేట వీధులన్నీ జనంతో నిండిపోయాయి. తమిళనాటలో జరిగే జల్లికట్టుకు… రంగంపేట పశువుల పోటీలకు చాలా తేడా ఉంది.

Read More : Kite String: స్కూటీపై వెళ్తుండగా గాలిపటం దారం మెడకు చుట్టుకుని యువతి మృతి

అక్కడ కోడెద్దులను, యువకులను ఒకేసారి రింగులో బరిలో దింపుతారు. పరుగెత్తే ఎద్దులకు ఎదురెళ్లి వాటి మూపురాలను రెండు చేతులతో ఒడిసి పట్టి వాటితో పాటు ప్రయాణించాలి. అలా ఎక్కువ దూరం ప్రయాణించే వాడే మొనగాడు. కానీ రంగంపేట జల్లికట్టు కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.. ఇక్కడ కనుమ రోజు పశువులను అందంగా అలంకరిస్తారు.

Read More : Team India : కోహ్లీ స్థానంలో ఎవరు ? కోన్ బనేగా టెస్టు కెప్టెన్.. బీసీసీఐకి కొత్త సవాల్

అటు తర్వాత పశువుల కొమ్ములకు పలకలు బిగిస్తారు. కొందరు పలకలలోనే చిన్నపాటి బంగారు, వెండి వస్తువులను ఉంచుతారు. ఈ పశువులను గ్రామంలోని వీధుల్లోకి వదులుతారు… పలకలను తగిలించుకొని మొనదేలిన కొమ్ములతో పరిగెత్తే ఈ కోడెద్దులకు యువకులు ఎదురెళ్లి వాటిని పట్టుకుని లొంగ తీసుకుంటారు. ఆ పలకలు చేజిక్కించుకున్న వారే ఇక్కడ మొనగాడు. ఇదీ రంగంపేటలో జరిగే జల్లికట్టు తీరు. ఏదేమైనా పోటీ విధానం ఏదైనా అందులో పాల్గొనే యువకులకు, పశువులకు గాయాలు కావడం మాత్రం కామన్‌..

ట్రెండింగ్ వార్తలు