Tadipatri : తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. ధైర్యం ఉంటే అలాచెయ్.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్..

అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

Tadipatri

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన ధ్యాన శివుని విగ్రహాన్నిటీడీపీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, ఇదే సమయంలో హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఈ సమాచారంతో కార్యకర్తలు, అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి బయలుదేరారు. వారిని పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: Rains: బాబోయ్.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..

హైకోర్టు అనుమతితో అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి పోలీసుల భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. హైకోర్టు ఆదేశాలతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. ఇరు నేతల పర్యటనల నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు 750 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉధ్రిక్తత పరిస్థితుల వేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నారాయణరెడ్డిపల్లి దగ్గర పెద్దారెడ్డిని పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు.

హైకోర్టు ఆర్డర్ అంటే లెక్కలేదా..? పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం..

కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసులకు హైకోర్టు ఆర్డర్ అంటే లెక్కలేదు. వారు పాటిస్తున్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్‌ను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నన్ను ఆపండని చెబుతుంటే పోలీసులు ఆపుతున్నారు.
జేసీ చెప్పిందే చట్టం, శాసనంగా పోలీసులు భావిస్తున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందంటే అదనపు బలగాలు పెట్టుకోమని కోర్టు చెప్పింది. అయినా, పోలీసులు లెక్క చేయకుండా జేసీ మాట వింటున్నారని పెద్దారెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ఇక్కడ ఎస్పీ, డీఐజీల మాటంటే లెక్కలేదు. హైకోర్టు ఆర్డర్లు చెత్తబుట్టలో ఉంటున్నాయి. నేను తాడిపత్రికి ఎప్పుడు రావాలో జేసీనే అడుగుతా అంటే కూడా పోలీసులు అనుమతించలేదు. ఇప్పుడు నామీద కేసులు కూడా పెట్టేలా ఉన్నారు. గతంలో నేను ఇలాగే వ్యవహరించి ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండేవాడు కాదు. తాడిపత్రిలో గత ఐదేళ్లు జేసీ స్వేచ్ఛగా తిరిగాడు. ఎప్పుడూ నేను అడ్డుకోలేదు. నేను తలచుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచే వారు కూడా కాదు. ఇక్కడ వ్యవస్థలన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. నన్ను ఏమైనా చేయాలంటే జేసీకి శక్తి లేదు. అది పోలీసుల ద్వారానే చేయాలి అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

నిన్ను బహిష్కరించాలని కోర్టులకు వెళ్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పెద్దారెడ్డి గతంలో 32కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేశాడు. ఇప్పుడెందుకు పోలీసుల మీద పడి ఏడుస్తున్నాడు. ధైర్యం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రా.. చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. నువ్వు కోర్టులకు వెళ్లినా అల్టిమేట్‌గా పోలీసులే చేయాల్సింది. మాకు లేవా కోర్టులు.. పోలీసులు కోర్టు ఆర్డర్ ధిక్కరించారని మళ్లీ కోర్టుకు పో.. నిన్ను బహిష్కరించాలని కోర్టులకు వెళ్తున్నారు. గతంలో పొట్టి రవిని ఐదేళ్లు జిల్లా నుంచి బహిష్కరించారు. ఒక దళిత మహిళను అన్యాయంగా జైలుకు పంపిచావు. జగన్ చెప్పాడు కదా.. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుంది. ముందు తాడిపత్రిలో నీ ఇళ్లు కాపాడుకో. అది మున్సిపల్ స్థలంలో కట్టావు చూసుకో అంటూ జేసీ ప్రభాకర్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యాడు.