Repalle Incident: రేపల్లె ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు: హోంమంత్రి తానేటి వనిత

రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత సోమవారం బాధితురాలిని పరామర్శించారు.

Vanitha

Repalle Incident: రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత సోమవారం బాధితురాలిని పరామర్శించారు. అనంతరం మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ ఘటన తాలూకు వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్లో వేచియున్న బాధిత మహిళ భర్తను..టైం ఎంతైందని అడిగి నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. భార్యను కాపాడుకునేందుకు భర్త ఇతరుల సహాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయిందని.. అర్ధరాత్రి సమయంలో రైల్వే పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదని..దీంతో బాధితుడు సమీపంలో ఉన్న సివిల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు హోంమంత్రి తెలిపారు.

Also read:Vijayawada: బాలికపై అఘాయిత్యానికి యత్నించిన ఆటో డ్రైవర్ అరెస్ట్

పోలీసు వాహనాల్లో సైరన్ శబ్దాలు విన్న నిందితులు పరారయ్యారని..వెంటనే సమీపంలోని నేతాజీ కాలనీలోని స్థానికుల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి వనిత పేర్కొన్నారు. మహిళ పట్ల జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో రేపల్లె పోలీసులు స్పందించిన తీరు..నిందితులను పట్టుకున్న తీరుపై సిబ్బందిని ఆమె అభినందించారు. నిందితులపై అట్రాసిటీ, హత్యాయత్నం, దోపిడీ వంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వనిత వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితురాలి మానసిక పరిస్థితి బాగాలేదని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని హోంమంత్రి తెలిపారు.

Also Read:Red Sandal Smuggling: రవాణాకు సిద్ధంగా ఉంచిన 22 ఎర్రచందన దుంగలు స్వాధీనం

దిశ చట్టం అమల్లోకి రాకపోవడం వల్లే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితుల్లో భయం లేకుండా పోయిందని ఆమె అన్నారు. రైల్వే పోలీసుల కంటే మా సివిల్ పోలీసులు వేగవంతంగా స్పందించారని హోంమంత్రి వనిత తెలిపారు. త్వరలో రైల్వేస్టేషన్ లలో పటిష్ట బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం బీహార్ లా తయారైందన్న టీడీపీ నేత లోకేశ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు

ఇటీవల మంగళగిరిలో టీడీపీ నాయకులే ఇటువంటి ఘటనకు పాల్పడ్డారని, అంటే లోకేశ్ దగ్గరుండి ప్రొత్సహిస్తున్నాడా? అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు భాదితురాలిని పరామర్శించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని..అయితే బాధితురాలి మానసిక స్థితి దృష్ట్యా కొందరిని మాత్రమే అనుమతిస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.