Red Sandal Smuggling: రవాణాకు సిద్ధంగా ఉంచిన 22 ఎర్రచందన దుంగలు స్వాధీనం
నిఘా కళ్లుగప్పి ఎర్ర చందనం అక్రమ సాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి తరలించే ముఠాను కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు

Red Sand
Red Sandal Smuggling: ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనం తరలింపు పై గట్టి నిఘా ఉంచిన పోలీసులు..ఎక్కడిక్కడే అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. అయినా పలు ప్రాంతాల్లో నిఘా కళ్లుగప్పి ఎర్ర చందనం అక్రమ సాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి తరలించే ముఠాను కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాలు మేరకు..ఎర్ర చందనం చెట్లను నరికిన ముఠాసభ్యులు ఆమేరకు వాటిని మందపల్లె పంట పోలాల్లో దాచి పెట్టారు. అనంతరం వాటిని దుంగలుగా మార్చి పోలీసుల కంట పడకుండా అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేశారు.
Also Read:Chandrababu Naidu: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు
రాబడిన సమాచారం మేరకు మందపల్లె పంట పోలాల్లో దాడులు జరిపిన పోలీసులు రవాణాకు సిద్ధంగా ఉంచిన 22 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో భాకరాపేట, చింత రాజుపల్లెకు చెందిన ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈమేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
Also Read:Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి
స్మగ్లింగ్ లో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడిన నిందితులపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిద్దవటం, ఓంటిమిట్ట పోలీసులను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.
Also Read:Brisk Walk: వాకింగ్ చేస్తున్నారా?: అయితే ఇలా చేసి చూడండి