Brisk Walk: వాకింగ్ చేస్తున్నారా?: అయితే ఇలా చేసి చూడండి
ఇలా వేగంగా నడవడాన్నే "బ్రిస్క్ వాక్" అంటారు. ఒక అధ్యయనం ప్రకారం బ్రిస్క్ వాక్ చేసే వారిలో..మిగతా వారికంటే ఎక్కువ ఫలితం కనిపించింది

Brisk
Brisk Walk: నగరాలు, పట్టణాల్లో నివసించే వారు తమ దైనందిన జీవితంలో బిజీ బిజీగా గడుపుతూ శారీరక ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టడం మానేస్తుంటారు. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు..’మీరు కొన్ని రోజులు వాకింగ్ చేయాలి’ అని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఏదో నడవాలి కాబట్టి నడుస్తున్నామంటే కుదరదు. వాకింగ్ వలన పూర్తి స్థాయి ప్రయోజనం చేకూరాలంటే పద్ధతి మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాకింగ్ చేసేటప్పుడు సాధారణంగా కొందరు నెమ్మదిగా నడుస్తుంటారు..మరికొందరు వేగంగా నడుస్తుంటారు. ఇలా వేగంగా నడవడాన్నే “బ్రిస్క్ వాక్” అంటారు. ఒక అధ్యయనం ప్రకారం బ్రిస్క్ వాక్ చేసే వారిలో..మిగతా వారికంటే ఎక్కువ ఫలితం కనిపించింది.
Also read:Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు
వాకింగ్ చేసేవారిపై ఇటీవల బ్రిటన్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ఈ విషయాన్నీ వెల్లడించింది. బ్రిస్క్ వాక్ చేయడం వలన శరీరంలో అవయవాలు త్వరగా అలసటకు గురౌతున్నాయని..ఇది ఇంచుమించు ఇతర వ్యాయామాలతో సమానమని పరిశోధకులు గుర్తించారు. బ్రిస్క్ వాక్ చేయడం వలన మనిషి జన్యువుల్లో ఉండే ‘టెలోమియర్’ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు తేల్చారు. జన్యువుల అంచుల్లో ఉండే ఈ టెలోమియర్ కణాల విభజనకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ విభజన జరిగే కొద్దీ, టెలోమియర్ బలహీనపడుతూ వార్ధక్యానికి దారితీస్తుందట. బ్రిస్క్ వాక్ చేసేవారిలో ఈ టెలోమియర్, ఇతరులతో పోలిస్తే 20 సంవత్సరాల యవ్వనంగా ఉండి వృద్ధాప్య లక్షణాలు కన్పించలేదట. సుమారు 4 లక్షల మంది జన్యువులను ఈ పరిశోధనకు ఉపయోగించారట.
Also read:ICMR On Corona 4thwave : కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్.. ఐసీఎంఆర్ కీలక ప్రకటన