Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు HRA పెంపు .. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

andhra pradesh
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు HRA (House Rent Allowance)పెంచుతు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పనిచేసే ఉద్యోగులకు HRA పెంచుతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. 12 నుంచి 16 శాతానికి పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కాదు కేవలం కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. పెంచిన ఈ HRA ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, అలాగే బాపట్ల, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, బాపట్ల, రాయచోటి జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించనుంది.
హౌస్ రెంట్ అలవెన్స్ లేదా హెచ్‌ఆర్‌ఏ అనేది ఉద్యోగులకు ఆ నగరంలో లేదా స్థానికంగా నివసించటానికి యజమాని లేదా ప్రభుత్వం (ప్రభుత్వ ఉద్యోగులైతే) చెల్లించే జీతం. ఇది మీ జీతంలో భాగమే అయినప్పటికీ..మీ బేసిక్ పే వలె కాకుండా, HRA పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం రెగ్యులేషన్ నంబర్ 2A కింద జీతం తీసుకునే ఉద్యోగి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) ప్రకారం.. హెచ్‌ఆర్‌ఏ మినహాయింపుకు అర్హులు. ఉద్యోగి వేతనంలో హెచ్ఆర్ఏ కలిసి ఉంటుంది. శాలరీ స్ట్రక్చర్‌లో ఇది కీలకమైన అంశం.