తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌లు .. ఆ స్థానాలపై కోట్లలో పందేలు

ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కోట్ల రూపాయల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపుపై, కడప ఎంపీ అభ్యర్థి ..

Huge Bettings

Bettings on Elections Results : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్ లను తలదన్నేలా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై పందెం రాయుళ్లు బెట్టింగ్ లు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అనంతరం జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయంపై బెట్టింగ్ ల జోరు కొనసాగుతుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

Also Read : ఏపీలో కౌంటింగ్‌కు సర్వంసిద్దం.. 33 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కోట్ల రూపాయల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపుపై, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల గెలుపోటములపైనా పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్ లు కాస్తున్నారు. హోటల్స్, రిసార్ట్, ఫామౌజ్, క్లబ్ లను రెంట్ కు తీసుకొని మరీ బెట్టింగ్ లు నడుపుతున్నారు. బెట్టింగ్ ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Also Read : Constable Kistaiah Family : మాట నిలబెట్టుకున్న కేసీఆర్.. కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తెకు ఆర్థికసాయం