Current Bill : వామ్మో.. కరెంటు బిల్లు రూ.6.74 లక్షలా?

వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగించే వ్యక్తికి విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. ఏకంగా ఆరు లక్షల కరెంట్ బిల్లు వేశారు.

Current Bill :  వామ్మో.. కరెంటు బిల్లు రూ.6.74 లక్షలా?

Current Bill

Updated On : August 6, 2021 / 8:57 AM IST

Current Bill : వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించే వ్యక్తికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. వెయ్యి కాదు రెండువేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే కరెంట్ బిల్ వేశాడు. బిల్లు చూసి కంగుతున్న ఇంటి యజమాని వెంటనే అధికారులను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన కానూరి లింగాచారి ఇంటివద్దే వడ్రంగి పని చేస్తుంటాడు. ఇతడికి ప్రతి నెల రూ.1500 నుంచి రూ.2000 మధ్య కరెంట్ బిల్ వస్తుంది. అయితే ఈ నేలమాత్రం రూ.6,74,900 వచ్చింది.

ఇదేంటని రీడింగ్ తీసిన వ్యక్తిని అడిగితే తమకేమి తెలియదని ఉన్నతాధికారులను సంప్రదించామని సూచించాడు. దీంతో లింగాచారి ఏఈ శ్రీనివాసులు కలిసాడు. విద్యుత్ మీటర్ లో తప్పిదం వల్లనే బిల్లు ఇంతమొత్తం వచ్చిందని.. సరిచేస్తామని చెప్పడంతో లింగాచారి ఉపిరిపీల్చుకున్నాడు.