Tirumala Huge Rush : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి వెలుపల క్యూ కట్టారు. క్యూలైన్స్ లో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
వరుసగా సెలవులు రావడంతో దారులన్నీ తిరుమల వైపే ఉన్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణిమ సందర్భంగా కొండపై మరింత రద్దీ ఉంది. ఈ నెల 15వ తేదీ వరకు సెలవులు ఉండటంతో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇక కొండపై వసతి గదులు దొరకడం కూడా కష్టంగా మారింది. చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఇదివరకే టీటీడీ సూచించింది. అయినా కొండపై రద్దీ మాత్రం తగ్గలేదు.
తిరుమల కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. అలిపిరి నడక మార్గం దగ్గర భక్తుల రద్దీ కనిపిస్తోంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. వచ్చే మూడు రోజుల పాటు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.
Tirumala : రద్దీ దృష్ట్యా తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి-టీటీడీ విజ్ఞప్తి
కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63వేల 754 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.63 కోట్లు ఆదాయం వచ్చింది. 30వేల 790 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం పౌర్ణమి కావడంతో గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది.
TTD Kalyanamastu : టీటీడీ కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా
తిరుమలకు వచ్చే భక్తులందరికీ వసతి ఏర్పాటు చేయడం కష్టమని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తులు తిరుపతిలోనే వసతి పొంది, తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలన్నారు. కొత్తగా గదుల నిర్మాణం చేపట్టకూడదని ప్రభుత్వం, హైకోర్టు ఆర్డర్ ఉన్నట్లు తెలిపారు. గదుల కొరత కారణంగా తిరుమలలో వసతి కొరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.
Tirumala Brahmotsavalu 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి జరుగనున్నాయి. భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణరథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహిస్తారు.