Tirumala Brahmotsavalu 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచించింది.

Tirumala Brahmotsavalu 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్

Tirumala Brahmotsavalu 2022 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచించింది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడవీధుల్లో నిర్వహిస్తుండటం, పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేశారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని టీటీడీ చైర్మన్ చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిజజ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డితో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

TTD Hundi Income : శ్రీవారి హుండీ ఆదాయంలో మరో రికార్డు..జులై నెలలో రూ.139.45 కోట్ల విరాళాలు

* సెప్టెంబ‌ర్ 26న‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ. సెప్టెంబ‌ర్ 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం.
* తొలిరోజైన‌ సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
* బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబర్ 1న గరుడ సేవ, 2న స్వ‌ర్ణ‌ ర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.
* తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు.
* క‌రోనా కార‌ణంగా రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌ సేవ‌లు నిర్వ‌హించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు.
* సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు.
* ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.
* పెర‌టాసి మాసం. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు.
* భక్తుల రద్దీకి తగ్గట్టు ప్ర‌తిరోజూ 9 ల‌క్ష‌ల లడ్డూల బ‌ఫ‌ర్ స్టాక్.

భ‌ద్ర‌త:
* సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ, పార్కింగ్‌ ఏర్పాట్లు. వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి, భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు.
* 24/7 కంట్రోల్ రూమ్‌, సీసీ కెమెరాలతో నిఘా.

TTD: 18న టీటీడీ వాచీల ఈ-వేలం

ఇంజినీరింగ్ : గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి.
* అలిపిరి వ‌ద్ద బైక్ లు, కార్లకు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం.
* నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా. జ‌న‌రేట‌ర్లు సిద్ధం.
* శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు.

ప్ర‌జాసంబంధాల విభాగం : 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు

ఆరోగ్య విభాగం : ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట. 5వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు.

వైద్య విభాగం : తిరుమల పాటు అలిపిరి, తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.

ర‌వాణ : ఏపీఎస్ఆర్‌టీసీ ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు. గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు.

Tirumula Hundi Income Report : తిరుమలలో కాసుల గలగల.. జూన్‌లో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బైక్ ల రాక‌పోక‌ల నిషేధం. కొండ మీద వాహనాల రద్దీని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ.

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ : శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు విభిన్న క‌ళారూపాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ఏర్పాటు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కళాకారులకు అవకాశం.