TTD Hundi Income : శ్రీవారి హుండీ ఆదాయంలో మరో రికార్డు..జులై నెలలో రూ.139.45 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో శ్రీవారికి భక్తులు అత్యధికంగా హుండీ కానుకలు సమర్పించారు. జులై నెలలో హుండీ ద్వారా 139 కోట్ల 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.

TTD Hundi Income : శ్రీవారి హుండీ ఆదాయంలో మరో రికార్డు..జులై నెలలో రూ.139.45 కోట్ల విరాళాలు

Ttd

TTD hundi income : తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో శ్రీవారికి భక్తులు అత్యధికంగా హుండీ కానుకలు సమర్పించారు. జులై నెలలో హుండీ ద్వారా 139 కోట్ల 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు మే నెలలో 130 కోట్ల 5 లక్షల రూపాయలు అందింది.

వరుసగా శ్రీవారి హుండీ ఆదాయం ఐదో నెల కూడా వంద కోట్ల రూపాయల మార్కు దాటింది. జులై నెలలో ఐదుసార్లు 5 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత నెల 4న స్వామి వారికి 6 కోట్ల 18 లక్షల రూపాయలు భక్తులు సమర్పించుకున్నారు. గతంలో 2018 జులై 26న 6 కోట్ల 28 లక్షల కానుకల్ని భక్తులు హుండీలో వేశారు.

Tirumula Hundi Income Report : తిరుమలలో కాసుల గలగల.. జూన్‌లో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. దీంతో హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా 100 కోట్లు దాటింది. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం 15 వందల కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.