Ap Liquor Shops (Photo Credit : Google)
Ap Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. రాష్ట్రంలో 3వేల 396 వైన్ షాపులు ఉండగా ఇప్పటివరకు 87వేల 116 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5వేల 764 దరఖాస్తులు రాగా, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ 5వేల 362 దరఖాస్తులు వచ్చాయి.
మూడో స్థానంలో ఏలూరు జిల్లా ఉంది. ఇక్కడ 5వేల 339 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా నెల్లూరు జిల్లాలో 1179 దరఖాస్తులే దాఖలయ్యాయి. ఈ నెల 14న లాటరీ తీసి మద్యం షాపులను కేటాయించనున్నారు అధికారులు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1740 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మొత్తం 3396 మద్యం షాపులు ఉండగా.. 87,116 అప్లికేషన్లు వచ్చాయి. దీని ద్వారా 1740 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులు ఉండగా.. ఏకంగా 5వేల 764 దరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 షాపులకు గాను 5వేల 362 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 లిక్కర్ దుకాణాలు ఉండగా.. 5వేల 339 దరఖాస్తులు దాఖలయ్యాయి.
నెల్లూరు జిల్లాలో 187 మద్యం షాపులు ఉండగా.. కేవలం 1179 దరఖాస్తులే వచ్చాయి. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఈ టెండర్లను ఈ నెల 14న ఓపెన్ చేస్తారు. లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు ఉంటుంది. 15వ తేదీన లాటరీ ద్వారా దక్కించుకున్న వారికి షాపులు ఇస్తారు. 16వ తేదీన నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తుంది. అదే రోజు నుంచి షాపులన్నీ కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తాయి.
Also Read : ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..! ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశం..