ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..!
ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Amrapali (Photo Credit : Google)
IAS Amrapali : ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోనే తమను కొనసాగించాలని 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారులకు సంబంధించి విభజన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు.. విభజన నాటి నుంచి కూడా తెలంగాణలోనే పని చేస్తున్నారు. తమను తెలంగాణకే కేటాయించాలని ఆ అధికారులు కేంద్రానికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. అయితే, వారి విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులు మొత్తం 11మంది వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆ మేరకు ఆయా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేస్తున్నారు..
తమను తెలంగాణలోనే కొనసాగించాలంటూ కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు చాలా కీలకమైన పోస్టుల్లో ఉన్నారు. ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, ప్రశాంత్.. వీరంతా తెలంగాణ ప్రభుత్వంలో చాలా కీ పోస్టుల్లో ఉన్నారు. ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నారు. రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష కీ పోస్టుల్లో పని చేస్తున్నారు. వీరంతా ఏపీ కేడర్ కు చెందిన వారే అయినా.. చాలా రోజులుగా తెలంగాణలోనే పని చేస్తున్నారు. వీరంతా వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Also Read : మంత్రి కొండా సురేఖకు షాక్..! పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి కేటీఆర్..
ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం కీలక నిర్ణయం..
ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆ 11 మంది ఆఫీసర్లను ఆదేశించింది. ఆమ్రపాలి విశాఖలో జన్మించారు. విశాఖలోని సత్యసాయి మందిర్ స్కూల్ లో చదువుకున్నారు. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. 2010 యుపీఎస్సీ ఎగ్జామ్ లో 39వ ర్యాంకు సాధించారు ఆమ్రపాలి. సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయిన అతిపిన్న వయస్కుల్లో ఆమ్రపాలి ఒకరు. వరంగల్ అర్బన్ జిల్లాకు ఆమె కలెక్టర్ గా పని చేశారు.
Also Read : రతన్ టాటా వారసుడు ఇతడేనా? ఎవరీ నోయల్ టాటా..? ముందున్న అతిపెద్ద సవాళ్లు ఏంటి?