శ్రీశైలం దేవస్థానంలో భారీ స్కాం…సాఫ్ట్ వేర్ మార్చేసి కోట్లు కోట్టేశారు

  • Publish Date - May 25, 2020 / 01:07 PM IST

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 3 కోట్ల 80 లక్షలకు పైగా కుంభకోణం జరిగింది. సాఫ్ట్ వేర్ మార్చేసి కోట్లు కొట్టేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏఈవో స్థాయి అధికారితో విచారణ చేపట్టామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన స్కామ్ వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులపై దేవస్థానం విచారణ చేపట్టింది. శ్రీశైలం దేవస్థానంలోని కొన్ని కౌంటర్లలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో వాటిని వెరిఫై చేస్తున్నామని తెలిపారు. 

శీగ్ర దర్శనం, ఆర్జిత సేవా కౌంటర్లలో అవినీతి జరిగినట్లుగా నోటీస్ కు రావడంతోటి విచారణ అధికారిని నియమించి పూర్తిగా విచారణ చేశామని వెల్లడించారు. ఇది గత మూడు ఏళ్ల నుంచి జరుగుతోంది. కొత్త సాఫ్ట్ వేర్ లో కొన్ని లొసుగులను ఆధారం చేసుకుని లేదా సాఫ్ట్ వేర్ ను మ్యాలిక్యులేట్ చేసి కొంత సమాచారం రాకుండా హైడ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు. 

విరాళాల సేకరణలో కోటి రూపాయలకు పైనే కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా అకామిడేషన్ కు సంబంధించి రూ.50 లక్షలకు పైగా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే అభిషేకం టిక్కెట్లకు సంబంధించి రూ.50 లక్షలు, శీగ్ర దర్శనం టిక్కెట్లకు సంబంధించి కోటి రూ.80 లక్షలు కుంభకోణం చోటుచేసుకున్నట్లు సమాచారం. భక్తుల సొమ్మును అనేక మంది కాజేస్తున్నప్పటికీ అధికారం యంత్రాంగం నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది.