Karumuri Nageswara Rao (Photo : Google)
Karumuri Venkata Nageswara Rao : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం (war of words) తారస్థాయికి చేరింది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పై పోటీకి తాను సిద్ధం అని ఆయన ప్రకటించారు. పవన్ కు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పరిపాలనపై ముందు అవగాహన తెచ్చుకోండి అని పవన్ కు సూచించారు మంత్రి కారుమూరి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడారు మంత్రి కారుమూరి.
Also Read..Adala Prabhakar Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
”నాడు చంద్రబాబుని ప్రశ్నించని పవన్ నేడు జగన్ ను ప్రశ్నించడం అంటే అంతకుమించిన కామెడీ లేదు. చంద్రబాబు హయాంలో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థుల డ్రాపౌట్స్ ఉండేవి. ఆనాడు పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? వైసీపీ ప్రభుత్వంలో పాఠశాలలకు అన్ని మౌలిక వసతులను కల్పించాం. విద్యార్థుల డ్రాపౌట్స్ ఎక్కడా లేవు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పరిపాలనపై అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి. ఇంగ్లీష్ భాష వద్దని, అడ్డుకోవాలని చంద్రబాబు, పవన్ చూశారు. నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే ఎంతో ముచ్చటగా ఉంది” అని మంత్రి కారుమూరి అన్నారు.
Also Merugu Nagarjuna: మీ పాలనలోనే ఇవన్నీ జరిగాయి: టీడీపీకి మంత్రి మేరుగు నాగార్జున కౌంటర్