Merugu Nagarjuna: మీ పాలనలోనే ఇవన్నీ జరిగాయి: టీడీపీకి మంత్రి మేరుగు నాగార్జున కౌంటర్

ఎన్నిశక్తులు ఏకమైనా అరచేతిని అడ్డుపెట్టి ఏ విధంగా సూర్యకాంతిని ఆపలేరో.. అదే విధంగా...

Merugu Nagarjuna: మీ పాలనలోనే ఇవన్నీ జరిగాయి: టీడీపీకి మంత్రి మేరుగు నాగార్జున కౌంటర్

Merugu Nagarjuna

Updated On : June 28, 2023 / 3:45 PM IST

Merugu Nagarjuna – YCP: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయంటూ టీడీపీ (TDP) చేస్తున్న ఆరోపణలు సరికాదని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దాడులు జరిగాయని, కులాలలను రెచ్చగొట్టారని మేరుగు నాగార్జున అన్నారు. వాటిని చంద్రబాబే ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు ఎక్కడా సామూహిక దాడులు జరగడంలేదని చెప్పుకొచ్చారు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న దాడులు మాత్రమే జరిగాయని తెలిపారు.

చంద్రబాబు హయాంలో సామాజిక అసమానతలు పెరిగాయని నాగార్జున చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక ద్రోహి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ భవిషత్తు గురించి కేసీఆర్ ఎన్ని కామెంట్స్ చేసినా తమకు వారిని తిట్టలనే ఆలోచనలేదని అన్నారు.

ఎన్నిశక్తులు ఏకమైనా అరచేతిని అడ్డుపెట్టి ఏ విధంగా సూర్యకాంతిని ఆపలేరో.. అలాగే జగన్ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు. వారాహి యాత్రలు లాంటివి ప్రజలకు ఎవరికి కావాలని అన్నారు. అలాగే, టీడీపీ ఎన్ని మీటింగులు పెట్టినా వారి నాటకాలను ఎవ్వరూ పట్టించుకోరని చెప్పారు. 2024లో ఎన్నికలు జరుగుతాయని, నేరుగా ఎన్నికల రణరంగంలోనే తేల్చుకుందామని సవాలు విసిరారు.

Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల