Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

చివరకు సుపారి ఇచ్చి హత్య చేయించే కుట్రలు చేస్తున్నారని వాళ్ల పార్టీ వాళ్లే చెప్పారని వివరించారు.

Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

Eatala Rajender

Updated On : June 28, 2023 / 4:18 PM IST

Eatala Rajender – BJP : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ వరంగల్లో ఈటల మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ (KCR) ఓ సైకోను ఎమ్మెల్సీగా నియమించారని అన్నారు.

ప్రగతి భవన్ నుండే తన హత్యకు కుట్రలు జరుగుతుందనే సంకేతాలు ఉన్నాయని ఈటల చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే తనకు చెప్పారని అన్నారు. చివరకు సుపారి ఇచ్చి హత్య చేయించే కుట్రలు చేస్తున్నారని వాళ్ల పార్టీ వాళ్లే చెప్పారని వివరించారు. తన సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరించారు.

జమ్మికుంట చౌరస్తాలో చెప్పులు మెడకేస్తా ఖబడ్దార్ బిడ్డా అని ఈటల హెచ్చరించారు. కౌశిక్ ను స్వయంగా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా కౌశిక్ రెడ్డి వేధిస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై కౌశిక్ రెడ్డి దాడులు చేస్తూ, భూతులు తిడుతున్నారని అన్నారు.

తాము ఇప్పటికే కౌశిక్ రెడ్డి తీరుపై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశామని ఈటల చెప్పారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాంబశివున్ని చంపాలనుకున్న నయీమ్ కు వార్నింగ్ ఇచ్చానని అన్నారు. దీంతో అప్పట్లో నయీమ్ తన డ్రైవర్ ను కిడ్నాప్ చేసి, తనను చంపడానికి ప్రయత్నించాడని చెప్పారు. తాను నయీమ్ కే భయపడలేదని, ఈ చిల్లరగాళ్లకు బయపడతానా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పరాకాష్ఠకు చేరిందని చెప్పారు.

Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి