Bode Rama Chandra Yadav(Photo : Google)
Bode Rama Chandra Yadav : భారత చైతన్య యువజన పార్టీ (BCYP) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హామీల వర్షం కురిపించారు. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో ఆయన చెప్పారు. భారత చైతన్య యువజన పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తానని చెప్పారు. ఎల్ కేజీ నుండి ఇంటర్ వరకు విద్య పూర్తిగా ఉచితం అన్నారు.
గుంటూరులో ప్రజా సింహ గర్జన సభలో రామచంద్ర యాదవ్ మాట్లాడారు. తమ నూతన పార్టీకి భారత చైతన్య యువజన పార్టీగా పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా BCYP అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హామీల వర్షం గుప్పించారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గేలా వారంలో ఐదు రోజులు మాత్రమే విద్యా సంస్థలు పని చేస్తాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో CBSC విద్యా సంస్థలు ఉండేలా బాధ్యత తీసుకుంటామన్నారు. మహిళల కోసం ప్రత్యేక విద్యా విధానం అమలు చేస్తాంమని చెప్పారు. కేజీ నుండి పీజీ వరకు మహిళలకు విద్య ఉచితం అన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
Also Read..Hindupur : బాలయ్యను ఓడించేలా వైసీపీ భారీ స్కెచ్.. రెబెల్స్ తేనేతుట్టెను కదిపిన టీడీపీ..
”ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తాం. రైతులను దీనస్థితి నుండి రక్షించేందుకు బీసీవై పార్టీ కృషి చేస్తుంది. పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం. వలసలు ఆపేందుకు రైతులకు ఆవును ఉచితంగా ఇస్తాం. కోట్లాది మంది కౌలు రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తాం. కౌలు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ BCY పార్టీ పూర్తి చేస్తుంది. బీసీ వర్గాల రైతులకు 25 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తాం. యువత భవిష్యత్ కోసం ఉపాధి అవకాశాల కోసం బాధ్యత తీసుకుంటాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే విధంగా బాధ్యత తీసుకుంటాం. పారిశ్రామిక అభివృద్ధి కోసం చైనా తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.
BCY పార్టీ మొట్ట మొదటి కార్యక్రమం యువత కోసం చేపడతాం. మెగా జాబ్ మేళా కోసం BCY పార్టీ అధ్వర్యంలో 500 కంపెనీలను విజయవాడ ఆహ్వానిస్తాం. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి నిందితులకు శిక్షలు పడటం లేదు. మహిళల అభివృద్ధి, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం.
Also Read..Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం.. భారీ బహిరంగ సభ
మహిళలను సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చేస్తాం. మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి. మహిళలకి 60 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తాం. డ్వాక్రా మహిళలకు ఉచిత భీమా సౌకర్యం కల్పిస్తాం. మహిళలు పారిశ్రామికాభివృద్ది సాధించేలా చర్యలు ఉంటాయి. మహిళ భద్రతకు కఠిన చట్టాలు తెస్తాం. మహిళల జోలికి వస్తే 24 గంటల్లో ఎన్ కౌంటర్ చేస్తారన్న భయం నిందితులకు కలగాలి. ఉద్యోగుల సంరక్షణ కోసం భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తాం” అని రామచంద్ర యాదవ్ ప్రకటించారు.