Chandrababu (1)
Chandrababu Fire YCP Activists : టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడ బిడ్డల గురించి సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరంగా పోస్టు చేస్తే చెప్పుతో బదులివ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. రేపల్లెలో దారుణం జరిగితే జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాయకులు సక్రమంగా ఉంటే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన మహాశక్తి కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధికారంలో ఉంటే ఆడ బిడ్డలకు రక్షణ ఉండేదని తెలిపారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది టీడీపీనే అని అన్నారు. తనకు కోపం, బాధ ఉందని.. గట్టిగా మాట్లాడాలంటే సభ్యత అడ్డు వస్తుందని చెప్పారు. కానీ వైసీపీ శ్రేణులకు సభ్యత అడ్డు రాదని బూతులు మాట్లాడుతారని ఫైర్ అయ్యారు.
Pawan Kalyan : నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటా : పవన్ కల్యాణ్
ఆడ బిడ్డల క్యారెక్టర్ పై తప్పుగా మాట్లాడే హీనమైన చరిత్ర కల్గిన దుర్మార్గులు వైసీపీ శ్రేణులు అని మండిపడ్డారు. ఏమీ భయపడొద్దని మహిళలకు ధైర్యం చెప్పారు. ఆడ బిడ్డలపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడితే చెప్పు ఫొటో తీసి అదే సోషల్ మీడియాలో పెట్టి చెప్పుతో కొడతానని చెప్పండాలని పిలుపు ఇచ్చారు.
మహిళలందరూ ఆ పని చేయాలన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెడితే “నేను మహాశక్తిని ఇదీ నా సమాధానమని ఒక చెప్పు ఫొటోను పోస్టు పెట్టాలని.. అప్పుడు బుద్ధి వస్తుంది” అని అన్నారు.