Atchannaidu : ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు : అచ్చెన్నాయుడు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు.

TDP Leader Atchannaidu

Atchannaidu – CM Jagan : వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ నేతల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 29 రోజులుగా ఏం చేశారని ప్రశ్నించారు. రూ.3300 కోట్ల అవినీతి ఆరోపణల నుంచి రూ.370 కోట్లు అని ఇప్పుడు రూ.27కోట్లు అంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారని మండిపడ్డారు. విరాళాలు బహిర్గతం చేసేందుకు తాము సిద్ధమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సంబంధం ఉన్నవారెవ్వరు పార్టీకి పైసా విరాళం కూడా ఇవ్వలేదని చెప్పారు. క్విడ్ ప్రోకో ద్వారా విరాళాలు సేకరించింది వైసీపీనేనని విమర్శించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు. పార్కింగ్ లో కార్ల లైట్లు బ్లింక్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.

పంచభూతాలను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాట్ గా ఎదిగాడని ఆరోపించారు. నిరసన వేడి జగన్మోహన్ రెడ్డికి తాకేలా ప్రజలు స్పందించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ అవినీతి, అక్రమ పాలనను ప్రశ్నించారనే అక్రమ కేసులో చంద్రబాబుని జైలుకు పంపారన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభంజనాన్ని అరచేతితో ఆపటం జగన్మోహన్ రెడ్డి తరం కాదని తెలుగుదేశం సీనియర్ నేత జీవీ ఆంజనేయులు అన్నారు.

144 సెక్షన్, సెక్షన్ 30యాక్ట్ లు ఇంకెన్ని నెలలు పెడతారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన రూ.3లక్షల 30వేల కోట్ల అవినీతి పేదలకు పంచితే, ప్రతీ ఒక్కరికీ రూ.10లక్షల అందుతాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే సమాధి కడతారని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు