Jogi Ramesh : వైసీపీపై యుద్ధం అంటే 5కోట్ల మంది ప్రజలపై యుద్ధం చెయ్యడమే, మీ ఇద్దరిని ప్రజలు పాతరేస్తారు- మంత్రి జోగి రమేశ్

పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో.. స్కిల్ స్కాం లో పవన్ కు వాటా ఉంది. చంద్రబాబు కొట్టేసిన రూ.370 కోట్లలో.. Jogi Ramesh

Jogi Ramesh Warning

Jogi Ramesh – Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోయారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అది మొదలు.. ఏపీ రాజకీయాల్లో రచ్చ మొదలైంది.

టీడీపీ-జనసేన పొత్తు గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పవన్ కల్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం ఏంటి? చంద్రబాబుతో ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారు? అని పవన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి జోగి రమేశ్.. పవన్ కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.(Jogi Ramesh)

”పరామర్శకు వెళ్లి పొత్తుల ప్రకటనలు ఏంటి..? బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో తాళి కట్టించుకున్నాడు. వైసీపీపై యుద్ధం అంటే 5కోట్ల ప్రజలపై యుద్ధం చెయ్యడమే. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో.. స్కిల్ స్కాం లో పవన్ కు వాటా ఉంది. చంద్రబాబు కొట్టేసిన రూ.370 కోట్లలో పవన్ షేర్ ఎంత..? పవన్ కి వాటా లేదంటే ప్రజలు నమ్మరు. అన్నీ బయటకి వస్తాయి. లోకేశ్ ఢిల్లీ వెళ్లి చంద్రబాబు చేసిన అవినీతిని జాతీయ మీడియాకు చెప్తాడా..? ఏ ప్రముఖ లాయర్ వచ్చి వాదించినా చంద్రబాబు తప్పించుకోలేరు. చంద్రబాబును బయటకి తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లి అందరి కాళ్ళు పట్టుకుంటున్నాడు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ లను ప్రజలు పాతరేస్తారు” అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

”లోకేశ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలకు, జాతీయ మీడియాకు ఏం చెబుతారు? ఢిల్లీకి వెళ్లి మా తండ్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్లు నొక్కేశాడని, హవాలా రూపంలో వాటిని తరలించి తాము కొట్టేశామని జాతీయ మీడియాకు చెబుతారా? జీ20 సదస్సు కారణంగా ఇప్పటివరకు మీ అయ్య చంద్రబాబు చరిత్ర ఏపీకి మాత్రమే తెలిసింది. ఇప్పుడు లోకేశ్ తనంతట తాను వెళ్లి ఆయన తండ్రి నిజస్వరూపాన్ని జాతీయ మీడియా ముందు చెబుతాడట? సిగ్గు, శరం వదిలేశారా?

ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లడం, ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక న్యాయవాదిని తీసుకురావడం చూస్తుంటే వీరు ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారో అర్థమవుతోంది. చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలుకు వెళ్లాడు. ఇప్పటి వరకు ఆయన స్టేలతో బతికాడు. చంద్రబాబు అవినీతి ప్రజలందరికీ తెలుసు. జగన్‌తో యుద్ధమంటే 5 కోట్ల మంది ఏపీ ప్రజలతో యుద్ధమే” అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.(Jogi Ramesh)

”చంద్రబాబు తన అవినీతిలో పవన్ కల్యాణ్‌కు ఎంత వాటా ఇచ్చారో చెప్పాలి. పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారు. కొత్తగా కలిసేదేమిటి? లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీరు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు. మీది నీచ సంస్కృతి. జగన్ ఒక వీరుడు, ధీరుడు.. దమ్మున్న మొనగాడు.. ఆయనను చూసి కొంచెమైనా నేర్చుకోండి. ఈరోజు మీ పతనం ఆరంభమైంది, అలాగే అంతం కూడా కాబోతుంది” అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?