Inhuman Incident In Kurnool : కర్నూలు జిల్లాలో అమానవీయం.. కులం పేరుతో అంత్యక్రియలకు అభ్యంతరం

కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.

Inhuman Incident In Kurnool కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.

గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన అనసూయమ్మ (70) మృతి చెందింది. దీంతో మృతురాలి కుమారుడు శ్రీనివాసులు అలియాస్‌ వాడాల శీను తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లగా, అక్కడ కుల సంఘం సభ్యులు కొందరు అభ్యంతరం తెలిపారు. పాడెని ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. కుల సంఘంలో సభ్యత్వం లేదన్న కారణంతో స్మశాన వాటికలో అంత్యక్రియలకు అడ్డు తగిలారు.

Sambrani : ఇంట్లో ధూపం ఎందుకు వేస్తారో తెలుసా?

కాగా, వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు స్మశాన వాటిక గేటు తాళం పగలగొట్టారు. దీంతో కుల సంఘం సభ్యులు మరింత రెచ్చిపోయారు. కుల సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సంఘంలో సభ్యత్వం లేదని, అంత్యక్రియలు ఎలా జరుపుతారని నిలదీశారు. దీంతో బాధిత బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కులం పేరుతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. స్పేస్ టూర్ దిశగా కృషి జరుగుతున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులం, మతం పేరుతో ఇలాంటి ఘటనలు చేసుకోవడం బాధాకరం అంటున్నారు. మనిషిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు