Anam Ramanarayana Reddy
ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఏకంగా తనకు ప్రాణహాని ఉందంటూ కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతేకాదు తాను ప్రయాణాల్లో కానీ.. టూర్లకు పోయినా..తన లైసెన్స్‌డ్ వెపన్స్‌ను క్యారీ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయనకు ప్రాణహాని ఉందా అని చర్చ జరుగుతుంది. ఆనంను ఎవరు టార్గెట్ చేస్తున్నట్లు అని నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది.
ఆత్మకూరు నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలపై మంత్రి ఆనం తన నివాసంలో మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశానికి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి వైసీపీకి చెందిన ఎంపీటీసీ వెళ్లడం రచ్చకు దారి తీసింది.
ఫ్యాన్ పార్టీకి వీర విధేయుడు
ఈ నేత ఫ్యాన్ పార్టీకి వీర విధేయుడు. అయ్యప్పస్వామి మాలలో ఉన్న ఆ వైసీపీ నేతను సమావేశoలోని కొందరు టీడీపీ నాయకులు గుర్తించి మంత్రి ఆనంకు సమాచారం ఇచ్చారు. ఇక్కడకు ఎందుకు వచ్చావు అని నిలదీశారు. మంత్రి ఆనం కూడా ఎలాంటి ఆహ్వానం లేకుండా ఎందుకు వచ్చావని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో సమావేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చానని వైసీపీ నేత చెప్పడంతో పోలీసులను పిలిపించి అప్పగించారు.
ఊహించని పరిణామంతో మంత్రి ఆనంతో సహా టీడీపీ శ్రేణులు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి ఆనంకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు. వైసీపీ మంత్రి ఆనంను టార్గెట్ చేసిందని విమర్శించారు. ఆనం కూడా తన పర్సనల్ వెపన్స్, పర్మీటెడ్ వెపన్స్‌ను తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం వస్తోందని అన్నారు. నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూడలేకే వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో కొంత వాస్తవం ఉందని అంటున్నారట. గతంలోనూ తన ఫోన్‌ను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని విమర్శించారట.
ఆయన టీడీపీ చేరేందుకు సిద్ధం?
అయితే సమావేశానికి వైసీపీ ఎంపీటీసీ హాజరవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. అనంతసాగరం మండలానికి చెందిన ఆ వైసీపీ నేత.. టీడీపీ చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆయన చేరిక గురించి మంత్రి ఆనంతో మాట్లాడేందుకు కొందరు టీడీపీ నాయకులు ఆ వైసీపీ నేతను సమావేశానికి తీసుకొచ్చారట.
అయితే ఈ విషయంపై మంత్రి ఆనంకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట. ఇంతలో వైసీపీ నేతను అక్కడున్న టీడీపీ నేతలు గుర్తించడం..మంత్రి ఆనంకు కంప్లైంట్ చేయడం..మంత్రి ఆనం ఆగ్రహించడం..వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే MPTCని తీసుకొచ్చిన టీడీపీ నేతలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. దీంతో సమావేశానికి వచ్చిన వైసీపీ నేతకు ఏం మాట్లాడాలో తెలియక ఆనం ఆగ్రహానికి బలయ్యారట. ఇలా ఊహించని పరిణామంతో ఆనంకు ప్రాణహాని అంటూ ప్రచారం విస్తృతంగా సాగుతోంది.