Perni Nani: పేర్నినానిది ఫ్రస్ట్రేషనా? కేసుల భయమా? పశ్చాత్తాపమా?

ఆ కేసులో పేర్నినాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది.

Perni Nani: పేర్నినానిది ఫ్రస్ట్రేషనా? కేసుల భయమా? పశ్చాత్తాపమా?

Perni Nani

Updated On : June 13, 2025 / 9:21 PM IST

పేర్నినాని. మనిషి కాస్త సాఫ్టే. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు..మంత్రిగా ఉన్న టైమ్‌లో ఆయన మాటలు ఎలా ఉండేవో అందరికి తెలిసిందే. వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా..రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మాటలు..తూటాల మాదిరి విసిరేవారు. అంతో ఇంతో క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న ఆయనకు..రేషన్ బియ్యం కేసు తెగ ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

కేసులు, ఆరోపణలే కాదు ఆయన ఇమేజ్‌ను ఘోరంగా డ్యామేజ్ చేసింది. అన్నింటికి మించి తన భార్య పేరు మీద జరిగే గోదామ్‌ బియ్య వ్యాపారానికి సంబంధించిన అంశాల్లో సమాధానం చెప్పలేని పరిస్థితిని ఫేస్ చేశారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. అయితే ఆ కేసు వ్యవహారం అలా కాస్త చల్లాబడిందో లేదో ఇప్పుడింకో కేసు పేర్నినాని మెడకు చుట్టుకోబోతుందన్న టాక్ వినిసి్తోంది. అరెస్టు అవుతారన్న ప్రచారం నేపథ్యంలోనే..ఆయన మళ్లీ నోటికి పని చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేషన్ బియ్యం కేసులో తన భార్యను తీసుకొని పదిహేను రోజులు రోజుకొక చోట దాక్కుంటూ తిరిగానని.. ఆ రోజే తాను మానసింకగా చచ్చిపోయినట్లుగా ఎమోషనల్‌ కామెంట్స్ చేసి మరోసారి చర్చకు దారి తీశారు పేర్నినాని. లక్కీగా బెయిల్ వచ్చిందని.. అయినా వదలకుండా తన భార్యను విచారించారంటూ చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్‌గా మరో కేసులో పేర్నినాని అరెస్ట్ అవుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాయిస్ రేజ్‌ చేస్తున్నట్లు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Also Read: సీఎం రేవంత్‌కు మంత్రుల మద్దతు ఏది?

అయితే బియ్యం కేసులో తన భార్యను అరెస్ట్ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ అప్పట్లో సీఎంను ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు మళ్లీ తిట్లదండకం అందుకుంటున్నారు. ఇదే ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గంతో పాటు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే బియ్యం కేసే కాదు పేర్నినాని మెడకు మరో కేసు చుట్టుకోబోతుందట. నకిలీ పట్టాల వివాదంలో ఆయనను అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారంతోనే మళ్లీ తెరమీదకు వచ్చి మాట్లాడుతున్నారంటూ టీడీపీ అటాక్ చేస్తోంది. దీంతో పేర్నినాని కామెంట్స్‌లో ఫ్రస్ట్రేషన్, కేసుల భయం రెండూ కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

పేర్ని నానికి ఉచ్చు గట్టిగా బిగిసిందా?
ఇళ్ల పట్టాల వ్యవహారంలో పేర్ని నానికి ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటే ఔనన్న టాక్ వినిపిస్తోంది. ఆ కేసులో అరెస్టు భయంతోనే నాని తరచు తన అరెస్టుపై స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. అనుచరులతో అత్యవసర మీటింగ్ పెట్టింది కూడా అరెస్ట్ టెన్షన్‌తోనేనని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారంట.

ఆ కేసులో పేర్నినాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్నినాని, పేర్నికిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అనుచరులతో అత్యవసర సమావేశం పెట్టిన ఆయన పోలీసులపై, టీడీపీ కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు కిట్టు విజయం కోసం పేర్నినాని నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఓవైపు పశ్చాత్తాపం..మరోవైపు ఫ్రస్ట్రేషన్..ఇంకోవైపు అరెస్ట్‌ భయంతో ఆయన అయోమయంలో పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పేర్నినాని ఇష్యూ ఎటువైపు టర్న్‌ తీసుకుంటుందో చూడాలి మరి.