Kakani Govardhan Reddy : ఆక్సిజన్ లేకపోవడం వల్ల 8 మంది రోగులు మరణించారన్నది అవాస్తవం.. లిక్విడ్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది : మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు.

Kakani Govardhan Reddy

Nellore Government Hospital : నెల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 8 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో 8 మంది రోగులు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. నెల్లూరులోని జీజీహెచ్ ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఎమ్ఐసీయూ వార్డులోని పరిస్థితులను అధికారులు మంత్రికి వివరించారు.

ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. ఈ వార్డులో 27 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు

లిక్విడ్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని, అదనంగా సిలిండర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మరణించిన వారిలో ఎవరూ వెంటి లేటర్ మీద లేరని స్పష్టం చేశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై కొందరు దుష్ప్ర చారం చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వ్యవస్థలపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దుర్మార్గమని, మంచి పద్ధతి కాదని హితవు పలికారు.