Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు

'డేటా ప్రైవసీ చట్టాలు మీరు సీఎంగా ఉన్నా, లేకున్నా ఒకేలా ఉంటాయి' జగన్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు

Pawan Kalyan question Jagan

Updated On : July 23, 2023 / 1:41 PM IST

Pawan Kalyan Questions Jagan : సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వం డేటా సేకరిస్తోందని, అది క్రైమ్ అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘డేటా ప్రైవసీ చట్టాలు మీరు సీఎంగా ఉన్నా, లేకున్నా ఒకేలా ఉంటాయి’ జగన్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

వాలంటీర్లకు బాస్ ఎవరు? ఏపీ ప్రజల పర్సనల్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు డేటా సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ మూడు ప్రశ్నలకు జగన్ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Rayana Bhagyalakshmi : పేదలకు ఇళ్లు నిర్మించాలన్న జగన్ సంకల్పానికి దేవుడు అండగా నిలిచారు : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

మరోవైపు వైసీపీని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్ మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు గానీ నష్టాలు వచ్చే స్టార్టప్ లకు మాత్రం కోట్లలో కాంట్రాక్టులు వస్తున్నాయని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించదా? అని ప్రశ్నించారు. టెండర్ల కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? పబ్లిక్ డోమైండ్ ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమస్యలపై వైసీపీ స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.