Chandrababu Naidu Arrest
Jana Sena Chief Pawan Kalyan: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు ములాఖత్ అయ్యారు. వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కల్పిస్తున్న భద్రత, వసతుల విషయంపై పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు తెలిసింది. జైల్లో ములాఖత్ ముగిసిన తరువాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan : పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రత విషయంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చంద్రబాబు తరపు న్యాయవాది జైల్లో భద్రతపై ఏసీబీ కోర్టులో వాదించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరుడుగట్టిన నేరస్తులు, మావోయిస్టుల మధ్య చంద్రబాబుకు భద్రత ఉండదని, ఆయన్ను హౌస్ అరెస్టు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది పిటీషన్ సైతం దాఖలు చేశారు. అయితే, సీఐడీ తరపున న్యాయవాదుల వాదనలకు ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, ఇటీవల.. జైల్లో ఉన్న చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం భవనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు భద్రత విషయంలో తనకు ఆందోళన ఉందని అన్నారు.
Jr NTR : చంద్రబాబుపై స్పందించని ఎన్టీఆర్.. అవార్డు కోసం దుబాయ్ కి..
టీడీపీ శ్రేణులు జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అనంతరం మీడియాతో పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు భద్రత విషయం ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.