Pawan Kalyan : పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan : పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Clarifies On Janasena,TDP Alliance

Pawan Kalyan : రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో కలిసే ముందుకు వెళతాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నా కోరిక అంటూ తెలిపిన పవన్ వైసీపీ అరాచకాలను ఎదిరించాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదన్నారు.

Pawan Kalyan : అన్యాయంగా రిమాండ్‌కు పంపారు,చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చా : వవన్ కల్యాణ్

వైసీపీని గద్దె దింపేందుకు దేనికైనా సిద్ధమేనని మొదటినుంచి చెబుతున్న పవన్ చంద్రబాబుతో ములాఖత్ తరువాత ముసుగులో గుద్దులాటలకు ముగింపు పలికారు. దీంట్లో భాగంగానే ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నానని..జనసేన, టీడీపీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దారుణ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీని గద్దె దింపాల్సిందేనన్నారు. దీని కోసం సమిష్టిగా ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందని కాబట్టి టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడివిడిగా పోటీ చేస్తే ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలంటే కలిసే పోటీ చేయాలన్నారు. అందుకే వైసీపీ అరాచకాలను అంతమొందించేందుకు జనసేన, టీడీపీ కలిసే పనిచేస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా 2014లో బీజేపీ, తెలుగుదేశంకు మద్దతు ఇవ్వడానికి కారణాలు ఏంటో కూడా వివరించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం కలిగిన నాయకుడు ఉండాలని నేను భావించా. అందుకే అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. అలాగే దేశానికి బలమైన నాయకుడి ఉండాలని మోదీకి మద్దతు ఇచ్చానని .. కానీ అప్పట్లో బీజేపీకి తాను మద్దతు ఇచ్చినందుకు విమర్శలు ఎదుర్కొన్నానని గుర్తు చేశారు.

2020 విజన్ అని అప్పట్లో చంద్రబాబు చెప్పినప్పుడు. చాలా మందికి అర్థంకాలేదని..కానీ ఈరోజు మాదాపూర్‌కు వెళ్తే.. ఒక కొత్త సిటీక్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుతో నాకు విధానపరంగా విబేధాలు ఉండొచ్చు..రాజకీయపరంగా అభిప్రాయ బేధాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విబేధించి ఉండొచ్చు. కానీ చంద్రబాబు అనుభవాన్ని, ఆయనకు ఉన్న సమర్థతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కలిసి పోటీ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నారు.అందుకే టీడీపీ,జనసేన పోటీ చేస్తాయని అన్నారు.

Anam Venkataramana Reddy : మరో 8 నెలల్లో అధికారంలోకి టీడీపీ.. డాన్సులు చేసుకుంటూ రోజాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాం : ఆనం

2019 ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ పార్టీల పరంగా భిన్నమైన ఆలోచనలతో మాత్రమే విడిగా పోటీ చేశాం. కానీ నేను ఎప్పుడు కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా వ్యతిరేకించలేదన్నారు. సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన లక్షలాదికోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సిటీని నిర్మించిన వ్యక్తికి.. 317కోట్లు స్కాం పెట్టి ఆయనపై అభియోగం మోపి ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా బాధాకరమన్నారు.చంద్రబాబుపై అభియోగాలు మోపిన వ్యక్తి మహానుభావుడా? లాల్ బహదూర్ శాస్త్రీనా? వాజ్ పేయినా? విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లే వ్యక్తి..ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని వ్యక్తి..రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి అంటూ మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసిన పవన్ బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన భవిష్యత్తుకోసం కాదు..రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే నా ఆకాంక్షనే పొత్తులు అని స్పష్టంచేశారు. యుద్ధమే కావాలంటే యుద్ధానికి మేము సిద్ధమేనని పవన్ తనదైన శైలిలో అన్నారు.