Pawan Kalyan : అన్యాయంగా రిమాండ్‌కు పంపారు,చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చా : పవన్ కల్యాణ్
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు.

Pawan Kalyan
Pawan Kalyan : స్కిల్ డెవలప్ మెంట్ లో స్కామ్ జరిగిందని దానికి చంద్రబాబే సూత్రధాని అనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చంద్రబాబు బెయిల్ పిటీషన్ వేసినా కోర్టు వాయిదాల వల్ల ఆయన విడుదల కాలేదు. దీంతో చంద్రబాబును పరామర్శించేందుకు..సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు వచ్చారు. చంద్రబాబుతో 40నిమిషాలు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. జైల్లో ఉండే ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు.
ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు. భారీ అవినీతులకు పాల్పడే వ్యక్తి పాలన చేత కాక ..ఇచ్చి హామీలను కూడా నిలబెట్టటం కూడా చేతకాని వ్యక్తి పాలనలో రాష్ట్రం కునారిల్లిపోతోందన్నారు. ప్రజల డేటాల చౌర్యాలు చేయటం నేరం కాదా..? అనిప్రశ్నించారు.
2014లో నరేంద్ర మోదీకి మద్దతు తెలిపినప్పుడు నన్ను అందరూ తిట్టారి కానీ..దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఆనాడు మోదీకి మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు పవన్.
నేనే ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై వెనక్కు వెళ్లేది లేదన్నారు. దానికి అనేక కారణాలు ఉంటాయన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకూకూడా నరేంద్ర మోదీ వద్దకు పిలిస్తే వెళ్లాను తప్ప నేను కావాలని వెళ్లలేదని తెలిపారు. దేశ సమగ్రతను, అభివృద్ధిని ఉద్దేశించే నేను ఏడైనా చేస్తానని పవన్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశారు.