Anam Venkataramana Reddy : మరో 8 నెలల్లో అధికారంలోకి టీడీపీ.. డ్యాన్సులు చేసుకుంటూ రోజాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాం : ఆనం వెంకటరమణారెడ్డి

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు సీఎం అవ్వడం గ్యారంటీ అని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Anam Venkataramana Reddy : మరో 8 నెలల్లో అధికారంలోకి టీడీపీ.. డ్యాన్సులు చేసుకుంటూ రోజాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాం : ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkataramana Reddy

Updated On : September 14, 2023 / 4:07 PM IST

Anam Venkataramana Reddy –  Minister Roja : మంత్రి రోజాపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు మంత్రి రోజాతో పాటు కొందరు మంత్రులు సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నారు. మరో 8 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు డ్యాన్సులు చేసుకుంటూ రోజాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తామని తెలిపారు.

‘లోకేష్ ను వాడు వీడు అని మాట్లాడతావా.. మేము నీపై మాట్లాడగలం’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు సీఎం అవ్వడం గ్యారంటీ అని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Bandi Sanjay : చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన బండి సంజయ్.. అప్పుడే అరెస్ట్ చేయాలా అంటూ ఫైర్

కాగా, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి రోజాతోపాటు వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి రోజా స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై టీడీపీ నేతలు, శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబును అరెస్టు చేస్తే స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటారా అని మండిపడ్డారు.

రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.