Janasena chief Pawan Kalyan criticized the AP police (1)
Pawan Kalyan : ఏపీ పోలీసులు రేపిస్టులను రక్షిస్తు బాధితులను మాత్రం వేధిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేసిన బాధితులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా పవన్ ఈ విమర్శలు చేశారు. జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరించాలనే పేరుతో కొంతమంది ఇళ్లను కూల్చివేశారు ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా జనసేన సభను స్థలం ఇచ్చినవారిపైనే వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి వారి ఇళ్లనే కూల్చివేసింది అంటూ జనసేన ఆరోపిస్తోంది. రోడ్డు విస్తరించాలనే సాకుతో జనసేనకు స్థలం ఇచ్చివారిపై వైసీపీ నేతలు కక్ష కట్టి వారి ఇళ్లను కూల్చివేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇప్పటం గ్రామం ఏమన్నా కాకినాడా? లేదా రాజమండ్రా రోడ్లు విస్తరించానికి అంటూ దుయ్యబట్టారు.
ఇలా ఇతరపార్టీలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతకాక ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంతలమయంగా మారిన రోడ్లు వేయాలని ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసి రోడ్లు విస్తరిస్తుందా? మహానేతల మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీల విగ్రహాలు కూల్చివేసి రోడ్లు విస్తరిస్తుందా? ఇటువంటి దారుణాలకు పాల్పడే వైసీపీ తమకు అధికారం శాశ్వతం అని అనుకుంటోందని కానీ ప్రజలను నానా కష్టాలుపాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు పవన్ కల్యాణ్. ఇళ్లు కూల్చివేయటం వంటి దౌర్జాన్యాలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించిన పవన్ కల్యాణ్..మీరు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తు ఇళ్లు కూల్చివేస్తుంటే మేం ఇడుపులపాయలో హైవే నిర్మిస్తాం అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ పోలీసులు ప్రతిపక్షాలన అడ్డుకోవటమే పనిగా పెట్టుకుందని..ముఖ్యంగా జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా అడ్డుకోవటమే పనిగా పోలీసులున్నారని..ఏపీ పోలీసులు రేపిస్టులను రక్షిస్తూ బాధితులను మాత్రం వేధిస్తున్నారని ఇది పోలీసు వ్యవస్థకే అవమానకరమని అన్నారు. మరోపక్క తమ కష్టసుఖాలు తెలుసుకోవటానికి వచ్చిన పవన్ కల్యాణ్ పై ఇప్పటం మహిళలు పూల వర్షం కురిపించారు.