Pawan Kalyan : మళ్లీ భీమవరం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ? త్వరలో క్లారిటీ

Pawan Kalyan : 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు.

Pawan Kalyan (Photo : Twitter)

Pawan Kalyan – Bhimavaram : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మళ్లీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉందని డిస్కషన్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఆ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.

కాగా.. ఈసారి భీమవరం నుంచే బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వారాహి విజయ యాత్రలో భాగంగా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

వారాహి విజయ యాత్ర పేరుతో ప్రస్తుతం పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహిపై ప్రజల మధ్యకు వెళ్లిన పవన్ కల్యాణ్.. అధికార పక్షం వైసీపీ లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఉంటున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యం అని పవన్ కల్యాణ్ ఓపెన్ గానే చెబుతున్నారు.

Also Read..Nara Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ పని చేస్తాం: నారా లోకేశ్

ఒక్కసారి జనసేనకు అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సుపరిపాలన అంటే ఏంటో తాను చూపిస్తాని అంటున్నారు. అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేసే విధంగా తన పాలన ఉంటుందని పవన్ చెబుతున్నారు. సీఎం జగన్ తన నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని పవన్ మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే వైసీపీ సర్కార్ ను ఓడించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.

Also Read..Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మరణం హత్యే: వర్ల రామయ్య

పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో సీఎం జగన్ లో డిప్రెషన్ కనిపిస్తోందని, ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. అవినీతి పునాదులతో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం పీఠాన్ని జనసేన త్వరలోనే కదిలించి ఇంటికి పంపుతుందన్నారు.