Naga Babu : జనసేన కీలక నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి వలసలు కంటిన్యూ అవుతాయని ఆయన చెప్పారు. ఆ పార్టీలో ఇంకా ఎంత మంది ఉంటారో తెలియదన్నారు. ఇంకా చాలా మంది జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని నాగబాబు జోస్యం చెప్పారు. మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డే వైసీపీ నుంచి బయటకు వచ్చేశాడు.. అలాంటిది మిగతా వాళ్లు రావడం పెద్ద లేక్కేమీ కాదన్నారు నాగబాబు.
పదవుల మీద, అధికారాల మీద ఆశలేదు..
అటు మంత్రి పదవిపైనా నాగబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారు. తనకు పదవుల మీద, అధికారాల మీద ఆశలేదని ఆయన తేల్చి చెప్పారు. పుంగనూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన భారీ బహిరంగసభలో నాగబాబు మాట్లాడారు.
Also Read : ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా.. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందంటే..
11 లో ఈసారి సింగిల్ డిజిట్ కు పడిపోదని గ్యారెంటీ ఏమిటి?
”మా మీద దౌర్జన్యం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. వాళ్లు చేసిన వెధవ పనులు బయటపెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యం ఎలా అవుతుంది? మేము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్నారు.
ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవడానికి చాన్స్ లేదు. 11 వచ్చాయి. 11 లో ఈసారి సింగిల్ డిజిట్ కు పడిపోదని గ్యారెంటీ ఏమిటి? మీరు ఏమన్నా రామరాజ్యం నడిపారా? మీరు ఏమన్నా మహానుభావుల్లా పరిపాలించారా? మీరు కలలు కనటం మానండి.
మీ పార్టీలో ఇంకా ఎంతమంది ఉంటారో తెలీదు..
త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చేస్తాయని, మనం అధికారంలోకి వచ్చేస్తాం అని జగన్ చాలాసార్లు అన్నారు. ఇంకా మానసిక సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు.. అప్పుడే వచ్చేస్తున్నాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్లని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మీ పార్టీలో ఇంకా ఎంతమంది ఉంటారో తెలీదు. అంతా వచ్చేస్తారు. చాలామంది బయటకు వచ్చేశారు. మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డే బయటకు వచ్చేశాడు. మిగతా వాళ్లు రావడం పెద్ద లేక్కేమీ కాదు” అని నాగబాబు అన్నారు.
Also Read : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది..
”పవన్ కల్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కల్యాణ్. ఆయన ఆధ్వర్యంలో పని చేయడం నిజంగా మాకు గర్వకారణం. నాకు ఏ పదవుల మీద, ఏ అధికారాల మీద ఆశలేదు. నిజాయితీగా పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు మేము పని చేస్తున్నాం. మన భవిష్యత్తును మరింత అద్భుతంగా చేసుకోవడం కోసం పని చేద్దాం. ఇంకా చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు వస్తాయి” అని నాగబాబు అన్నారు.
ఆ దారం ఎప్పుడైనా తెగుతుంది, ఆ కత్తి మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది..
”22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఆ 22 లక్షల మంది ప్రజల గొంతుకను శాసనసభలో వినిపించలేని మీరు.. వచ్చే ఎన్నిక్లలో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారనే భ్రమలో ఎవరూ లేరు. గుర్తు పెట్టుకోండి. ఏడాది లేదా రెండేళ్లలో మీరు చేసిన నేరాలకు, అక్రమాలకు సమాధానం చెప్పుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెత్తి మీద దారం సపోర్ట్ తో కత్తి వేలాడుతోంది. ఆ దారం ఎప్పుడైనా తెగుతుంది, ఆ కత్తి మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది.. గుర్తు పెట్టుకోండి” అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.