Janasena Leaders – Gudivada Amarnath : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ సంధించిన పది ప్రశ్నలపై జనసేన నాయకులు కౌంటర్ ఇచ్చారు. వారాహి యాత్రను ప్రక్కదారి పట్టించడానికి మంత్రి అమర్నాధ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. గుడివాడ అమర్నాథ్ కాదు గుడ్డివాడు అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు తక్షణమే అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియని వ్యక్తి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యను బయటకు తీసుకువచ్చింది జనసేన పార్టీ అని అన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడం మాని పరిశ్రమల శాఖపై దృష్టి పెట్టాలని బొలిశెట్టి సత్యనారాయణ సూచించారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనపై మాట్లాడడానికి మంత్రి అమర్నాథ్ ఎవరని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.