Nara Brahmani : బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు .. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు

చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశమైయ్యారు. కీలక విషయాలు చర్చించారు.

janasena leaders meets nara brahmani

janasena leaders meets nara brahmani : చంద్రబాబు అరెస్టు తరువాత ఎప్పుడు లేనిది ఆయన కోడలు..టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి మొట్టమొదటిసారిగా రాజకీయంగా స్పందించారు. వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. తి సంస్థలు, యువత ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయటం వైసీపీ నేతలకు తగదని నారా బ్రాహ్మణి హితవు పలికారు. వైసీపీ నాయకులు పాలనలో అసమర్థులు మాత్రమే కాదు, నిజాన్ని కూడా చూడలేని కపోదులు అని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఒకానొక క్రమంలో టీడీపీ పగ్గాలు నారా బ్రాహ్మణి చేపడతారనే వార్తలు కూడా వచ్చాయి. కొంతమంది టీడీపీ నేతలు కూడా అదే అభిప్రాయాలను వ్యక్తంచేశారు.దీనికి కారణం చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేశ్ ను కూడా అరెస్ట్ అవుతారు అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు..అదే జరిగితే బ్రాహ్మణితో పార్టీని నడిపిస్తాం అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారాయి.

Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన పార్టీ నేతలు భేటీ అయ్యారు. రాజమండ్రిలో బ్రాహ్మణితో పలువురు జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మీవెంట మేమున్నాం అనే భరోసాను కల్పించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తు రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కాగా..చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? ఎంట్రీ ఇస్తున్నారని పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. విజయవంతమైన యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి ఎప్పుడూ రాజకీయ విషయాల్లో జోక్యం కల్పించుకోని ఆమె చంద్రబాబు అరెస్ట్ తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాట్ టాపిక్ గా మారింది.ఇక పార్టీ పగ్గాలు ఆమే చేపడతారనే వార్తలు వినిపించాయి. ఈక్రమంలో జనసేన నేతలు బ్రాహ్మణితో సమావేశం కావటం మరింత హాట్ టాపిక్ గా మారాయి.

Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

ఓ పక్క చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలు చేయటం ఆయన రిమాండ్ ను పొడిగించేలా జైల్లో ఉంచేలా పిటీషన్ల వేయటంతో దానికి తోడు హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేత..ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీకి చంద్రబాబును అప్పగించటం.. రెండు రోజుల విచారణ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు పిటీషన్ వంటి పలు కీలక పరిణామాల మధ్య బ్రాహ్మణితో జనసేన నేతలు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

కాగా చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపారు. చంద్రబాబుతో బాలకృష్ణ, నారాలోకేశ్ తో కలిసి ములాఖత్ అయ్యారు. ఆ తరువాత మీడియా ముందు ఏపీ పొత్తులపై కుంబ బద్దలు కొట్టారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. దీంతోఏపీ రాజకీయాలో మరోసారి హీటెక్కాయి. చంద్రబాబు అరెస్టకు నిరసనగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు