JC Prabhakar Reddy: వివేకానంద హత్యకేసుపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

JC Prabhakar Reddy

YS Viveka Case: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే దేశ సరిహద్దు భద్రతా దళాలు అవసరమా అంటూ ప్రశ్నించారు.

YS Viveka Case: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక హంతకున్ని మేము విచారణ చేస్తామంటే పోలీస్ వ్యవస్థ చేతులెత్తేసింది. ఒక ఎస్పీ నాకు చేతకాదు అనేశాడు. అదే నేను ఒక చిన్న ట్రాక్టర్ రిపేరు చేయిస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఉంది ఏపీలో పోలీసు వ్యవస్థ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలానా వాళ్లే హత్య చేశారని ఎవరు చెప్పడం లేదు. వాళ్లే హత్య కేసును విచారించేందుకు సీబీఐకి అప్పగించారు. ఇప్పుడు సీబీఐ విచారణకు రమ్మంటే వెళ్లడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

YS Viveka Case : ఈ నెల 27 వరకు విచారణకు రాలేను

మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసింది. ఈరోజు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు