MLA Peddareddy : జేసీ దివాకర్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి చంపాలనుకుంటున్నారు : ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని పెద్దారెడ్డి అన్నారు.

MLA Peddareddy : జేసీ దివాకర్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి చంపాలనుకుంటున్నారు : ఎమ్మెల్యే పెద్దారెడ్డి

Peddareddy Comments JC Prabhakar Reddy

Updated On : August 20, 2023 / 3:49 PM IST

MLA Peddareddy – JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని ఎమ్మెల్యే చేసేందుకు జేసీ దివాకర్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. బెడ్ పై ఉన్న తన సోదరిని చంపాలనుకున్నారని పేర్కొన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయని, ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని వెల్లడించారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని పెద్దారెడ్డి అన్నారు.

Yarlagadda Venkata Rao: చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ.. టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్.. వైసీపీ నేత సజ్జలపై కీలక వ్యాఖ్యలు

జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో కాంపౌండ్ నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కాలేజీ గ్రౌండ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. జేసీకి 10 నెలలు టైం ఉంది.. ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకుని పోతారని పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు.