KA Paul : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం రూ.4 వేల కోట్లు రెడీ, కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తీర్చేస్తా : కేఏ పాల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.

KA Paul – Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.4 వేల కోట్లు రెడీ చేసా, కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తీర్చేస్తా అంటూ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను.. కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని అన్నారు. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది.. కుటుంబ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. కాపు, బీసీ, ఎస్సీలు అందరూ కలిసి రండి.. నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి కలిసి పనిచేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు.

జేడీ లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని తెలిపారు. గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని స్థానాల్లోను తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.

Vizag steel plant : విశాఖ ఉక్కు కోసం ఎంతవరకు అయినా వెళతా .. నా ప్రాణాలు పణంగా పెడతా : KA Paul

ఇదే సందర్బంగా కేఏ పాల్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరమన్నారు. పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. జనసేన నుంచి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక్కో అభ్యర్థికి అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించారు. లోకేశ్ జెండా మోయడం మానుకోకుంటే.. వంగవీటి రంగా ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తుల వలనే బీసీలు ముఖ్యమంత్రి కాలేదని అన్నారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరం.. ఆయన సింగపూర్ లో సెటిల్ అయితే మంచిది అంటూ సలహాలిచ్చారు.

కాగా కొన్ని రోజుల క్రితం పాల్ మాట్లాడుతు.. స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ఉండటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని అన్నారు. రూ.4 వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని.. స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని అన్నారు. నేను 5 లక్షల కోట్లను తెచ్చా మీరు ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వలేకపొతున్నారు? అని ప్రశ్నించారు. నా ఫండ్స్ రాకుండా ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో గతంలో  తాను  చేసిన వాగ్ధానానికి కట్టుబడి ఉండి రూ.4 వేల కోట్లు రెడీ చేసానంటూ చెప్పుకొచ్చారు.

KA Paul : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా నా ఫాన్స్ అయిపోండి .. నా దగ్గర రోడ్ మ్యాప్ ఉంది : కేఏ పాల్

                   

ట్రెండింగ్ వార్తలు