అమెరికాలోని భారతీయులకు కెఏ పాల్ కీలక సూచన.. నేను వస్తున్నా.. మీరు అలా మాత్రం చేయొద్దంటూ విజ్ఞప్తి
అమెరికాలోని అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝళిపిస్తున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అమెరికాలోని భారతీయ వలసదారులకు కీలక సూచన చేశారు.

KA Paul
KA Paul: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోని అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నాడు. అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపించేస్తున్నారు. కొందరిని అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వారిలో ఆందోళన పెరుగుతుంది. అయితే, అలాంటివారికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక సూచనలు చేశారు.
Also Read: ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ..! స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాలో నివసిస్తున్న భారతీయులందరికీ రక్షణ కల్పించాలని కోరుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇటీవల లేఖ రాశానని.. భారతీయులని వెనక్కి పంపే ప్రక్రియ ఆపాలని ట్రంప్ ను కోరానని కెఏ పాల్ తెలిపారు. అమెరికాలో ఉన్న భారతీయులు ఆందోళన చెందొద్దు.. ట్రంప్ మనసు మార్చుకునేలా ప్రార్ధన చేస్తున్నా. నేను అమెరికాకు వస్తున్నా.. అమెరికాలో భారతీయులతో సదస్సు నిర్వహిస్తా.. ఎవరూ అధైర్య పడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ కెఏ పాల్ సూచించారు. 2020లో ఓడిపోతారు, కరోనా వస్తుంది.. అరెస్టు చేస్తారని చెప్పా.. అవన్నీ జరిగాయి. నన్ను ట్రంప్ ప్రత్యేకంగా చూస్తారని పాల్ చెప్పారు. కులాలకు అతీతంగా ఉంటే నేను మీకు అండగా ఉంటానని అన్నారు.
Also Read: అమెరికాలో ట్రంప్ వేట.. గుడి, బడి అని లేదు.. ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లో.. గురుద్వారాల్లో కూడా..
ఏప్రిల్ లో వాషింగ్టన్లో నేను నిర్వహించే సదస్సుకు భారతీయులు హాజరుకావాలి. సెనేట్ చైర్మన్ నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారా ట్రంప్ విధానాలకు చెక్ పెడతా. స్వింగ్ స్టేట్స్ లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారత్ కు అమెరికా కావాలి.. అమెరికాకు భారత్ అవసరం ఉందని కెఏ పాల్ పేర్కొన్నారు. 8000 వేల మంది భారతీయ వలసదారులను అమెరికాలో ఉండనివ్వాలి. అక్రమ వలసదారులను పంపడానికి అమెరికా చట్టం ప్రకారం 2/3 మెజారిటీ అవసరమని పేర్కొన్న పాల్.. అమెరికాలో తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్రంప్ కి లేఖ రాయాలంటూ సూచించారు.